యూఏఈలో గుప్తా బ్రదర్స్ అరెస్టు

యూఏఈలో  గుప్తా బ్రదర్స్ అరెస్టు

సంపన్నులైన గుప్తా బ్రదర్స్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్.. యూఏఈలో అరెస్టయ్యారు. అక్రమాలు బయటపడగానే దుబాయి పారిపోయిన ఈ ముగ్గురు సోదరుల్లో రాజేశ్ గుప్తా, అతుల్ గుప్తాను అరెస్టు చేసినట్లు సౌతాఫ్రికా ప్రభుత్వం వెల్లడించింది. అయితే మూడో సోదరుడు అజయ్ గుప్తాను అరెస్టు చేశారా.. లేదా అనే విషయంపై స్పషత లేదు. అవినీతి వ్యవహారంలో గుప్తా సోదరులపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి దాదాపు ఏడాది తర్వాత వీరు అరెస్టయ్యారు. సౌతాఫ్రికా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల నుంచి 15 బిలియన్ల ర్యాండ్లను దోచుకున్నారని గుప్తా సోదరులపై ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలపై విచారణలు సాగుతుండగానే ఈ సోదరులు సౌతాఫ్రికా నుంచి కుటుంబాలతో సహా దుబాయికి పారిపోయారు. దీంతో సౌతాఫ్రికా ప్రభుత్వం ఇంటర్ పోల్ ను ఆశ్రయించగా.. వీరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. దుబాయి నుంచి గుప్త సోదరులను రప్పించి శిక్ష వేసేందుకు సౌతాఫ్రికా ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. రెండు దేశాల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం లేకపోవడంతో గుప్తా సోదరులను వెనక్కి తీసుకొచ్చేందుకు దక్షిణాఫ్రికా.. ఐక్యరాజ్యసమితి ఆశ్రయించింది. అయితే ఆ తర్వాత 2021లో యూఏఈతో నేరస్థుల అప్పగింతపై ఒప్పందం చేసుకుంది. దీంతో యూఏఈ ప్రబుత్వం రాజేశ్, అతుల్ గుప్తాలను సౌతాఫ్రికాకు అప్పగించే అవకాశాలున్నాయి.
2018లో ఇద్దరిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో వాళ్లపై న్యాయవిచారణ జరిగింది. గుప్తా సోదరుల అవినీతితో జాకబ్ జుమాపై ఒత్తిడి పెరిగింది. దీంతో 2018లో జుమా అధ్యక్ష పదవి నుంచి బలవంతంగా దిగిపోవాల్సి వచ్చింది. 1993లో గుప్తా ఫ్యామిలీ ఇండియా నుంచి సౌతాఫ్రికాకు వలస వెళ్లింది. భారత్ లోనూ గుప్తా ఫ్యామిలీపై మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. 2018లో ఆ కేసుకు సంబంధించి ఐటీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తల కోసం : -
చోరీ అయిన బైక్​ను పోలీసులే వాడుతున్నరు


యువతికి త్రీడీ ప్రింటింగ్ చెవి అమర్చిన డాక్టర్లు