చోరీ అయిన బైక్​ను పోలీసులే వాడుతున్నరు

చోరీ అయిన బైక్​ను పోలీసులే వాడుతున్నరు

ఉన్నతాధికారులకు పాక్ సివిలియన్ కంప్లైంట్

ఇస్లామాబాద్: తన బైక్ ఎవరో ఎత్తుకెళ్లిపోయారని ఎనిమిదేండ్ల కింద పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తికి..  ఆ బైక్​ను పోలీసులే వాడుతున్నారని తెలిసి షాక్ తిన్నాడు. పాకిస్తాన్​లోని పంజాబ్ ప్రావిన్స్​లో ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇమ్రాన్​అనే వ్యక్తికి చెందిన హోండా సీడీ70 బైక్.. లాహోర్​లోని మొఘల్​పుర ప్రాంతం నుంచి ఎవరో దొంగిలించారు. దీనిపై ఇమ్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆపై ఇమ్రాన్ పలుమార్లు పోలీసులను కలిసి బైక్ గురించి ఆరా తీస్తే.. దొరుకుతుందిలే అనే సమాధానమే తప్ప.. బైక్​ను మాత్రం కనిపెట్టలేకపోయారు. ఇలా ఎనిమిదేండ్లయ్యాక ఈ మధ్యే అతని బైక్ మీద పెనాల్టీ పడిందంటూ ఈ–చలాన్ ఇమ్రాన్ ఇంటి అడ్రస్​కు వచ్చింది. అందులో చూస్తే పోలీసులే తన బండి నడుపుతూ రూల్స్ క్రాస్ చేసినట్లు కనిపించడంతో ఇమ్రాన్ ఆశ్చర్యపోయాడు. ఇంతకాలం పోలీసులే తన బైక్ వాడుతున్నారని తెలిసి చీఫ్ సివిలియన్ పర్సనల్ ఆఫీసర్​కు కంప్లైంట్ చేశాడు. కాగా, బైక్​ల మీద ఈ చలాన్లు వేసుడు పాక్​లో చట్టవిరుద్ధమని లాహోర్ హైకోర్టు మరోకేసులో కిందటి బుధవారం తీర్పునిచ్చింది. ఈ చలాన్లు విధించే సిస్టమే ప్రభుత్వం సక్కగ ప్రవేశపెట్టలేదని, పోలీసులు బైకర్లమీద చలాన్లు విధుంచడమేంటని ప్రశ్నించింది.

మరిన్ని వార్తల కోసం...

జూన్ 2న యాడ్స్ కోసం పెట్టిన ఖర్చెంత?

మంచం పట్టిన ‘తెనుగుపల్లె’