డేరా బాబాకు మళ్లీ పెరోల్

డేరా బాబాకు మళ్లీ పెరోల్
  • దోషిగా తేలిన తర్వాత పెరోల్ రావడం ఇది15వ సారి 

చండీగఢ్: డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ (డేరా బాబా) కు కోర్టు మరోసారి 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. చివరగా గతేడాది ఆగస్టులో ఆయనకు పెరోల్ వచ్చింది. 2017లో దోషిగా తేలిన అనంతరం ఆయనకు పెరోల్ మంజూరు కావడం ఇది15వ సారి. ఇద్దరు శిష్యులను అత్యాచారం చేసిన కేసులో డేరాబాబాకు కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది.

ప్రస్తుతం ఆయన హర్యానా రోహ్‌‌ తక్ జిల్లాలోని సునారియా జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఆయనకు కోర్టు పదేపదే పెరోల్ ఇస్తుండటంతో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీతో సహా సిక్కు సంస్థలు విమర్శలు గుప్పిస్తున్నాయి.