సిద్దిపేట రూరల్, వెలుగు: నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొందిలో గ్రామ కేబినెట్ఏర్పాటు చేశారు. సర్పంచ్ ఆకుల స్వప్న ఆధ్వర్యంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి 10 మంది వార్డు సభ్యులకు ఆరోగ్యం, పారిశుధ్యం, రెవెన్యూ, విద్యుత్, స్త్రీ, శిశు సంక్షేమం, తాగునీరు, ఉపాధిహామీ, విద్య, హౌసింగ్, వ్యవసాయ శాఖలను అప్పగించారు. గ్రామ ప్రజలు వీరిని కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలని సర్పంచ్సూచించారు.
