డార్క్ కామెడీతో గుర్రం పాపిరెడ్డి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

డార్క్ కామెడీతో గుర్రం పాపిరెడ్డి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌


‘‘యువతరం నుంచి అద్భుతమైన సినిమాలు వస్తాయని నా నమ్మకం. పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంటేనే అందులో ఒక చిన్న ఎక్సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, ఎలివేషన్ ఉంటాయి. అలాంటి కొత్త తరం రావాలని నేనెప్పుడూ కోరుకుంటాను” అన్నారు బ్రహ్మానందం.  ‘గుర్రం  పాపిరెడ్డి’ చిత్రం టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ వేడుకలో ఆయన 
పై విధంగా స్పందించారు.  నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్ దర్శకత్వంలో వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ)  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  బ్రహ్మానందంతో పాటు కోలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమెడియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యోగిబాబు కీలకపాత్రలు పోషించారు.

  బ్రహ్మానందం మాట్లాడుతూ ‘చక్కని కామెడీతో సాగే థ్రిల్లర్ ఇది.  యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిసి చేస్తున్న ఈ చిత్రంలో జడ్జి పాత్రలో నటించా.  అలాగే కోలీవుడ్ క్రేజీ కమెడియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యోగిబాబు ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్’ అని చెప్పారు.  ఇందులో మంచి క్యారెక్టర్ చేశానని,  అందరినీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేసేలా ఉంటుందని యోగిబాబు చెప్పాడు.  అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమా ఇదని నరేష్ అగస్త్య చెప్పాడు.  ఇంతమంది కమెడియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందిన ఫరియా చెప్పింది.  అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే డార్క్ కామెడీ థ్రిల్లర్ ఇదని దర్శకనిర్మాతలు తెలియజేశారు.  నటులు ‘ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ శ్రీను,  జీవన్ కుమార్,  వంశీ,  డీవోపీ అర్జున్ రాజా, మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణ సౌరభ్ తదితరులు పాల్గొన్నారు.