కేజేఆర్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గుర్తింపు మూవీ ..

కేజేఆర్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గుర్తింపు మూవీ ..

దేశ క్రీడా వ్యవస్థలోని లోపాలను, పేద క్రీడాకారులు ఎదుర్కొనే సవాళ్లను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చిత్రం ‘గుర్తింపు’. కేజేఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి జె.పి. తెన్ పతియాన్ దర్శకుడు. బుధవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి అథ్లెట్‌‌‌‌గా ఎదిగేందుకు ప్రయత్నించే ఒక యువకుడి ప్రయాణం, అతనికి ఎదురైన రాజకీయ అవరోధాల చుట్టూ తిరిగే కథ ఇది.   కేవలం స్పోర్ట్స్ డ్రామాగానే కాకుండా, క్రీడా శాఖ మంత్రినే కోర్టు బోనులో నిలబెట్టే పవర్‌‌‌‌ఫుల్ కోర్ట్ డ్రామాగా చూపించారు. 

‘మైదానంలో గెలవడం కంటే, ఆ మైదానం వరకు వెళ్లడమే పెద్ద యుద్ధం’ అనేది మెయిన్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌గా కనిపిస్తోంది.  ‘అథ్లెటిక్స్‌‌‌‌లో మెడల్స్ సాధిస్తున్న వారిలో ముప్పావు వంతు మంది మీరు చెప్పే ఆ కూటికి దిక్కులేని వాళ్లే... క్రికెట్ మాత్రమే క్రీడ కాదు.. ఆట అనేది మా లాంటి వాళ్లకు ఒక విడుదల..’ లాంటి ఆలోచింపజేసే డైలాగ్స్‌‌‌‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. 

హీరోగా కేజేఆర్ బాడీ ట్రాన్స్‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌, నటన ఇంప్రెస్ చేశాయి. గంగా ఎంటర్టైన్మెంట్స్, స్వస్తిక్ విజన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌‌‌‌కే ప్రశాంత్, అజిత్ బాస్కర్, అరుణ్ మురుగన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జూన్‌‌‌‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.