ఈ సినిమా చూస్తుంటే నాగార్జున ‘గీతాంజలి’ గుర్తొస్తుంది : రామారావు

ఈ సినిమా చూస్తుంటే నాగార్జున ‘గీతాంజలి’ గుర్తొస్తుంది : రామారావు

సత్యదేవ్, తమన్నా జంటగా నాగశేఖర్ రూపొందించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’.  చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ కలిసి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కానున్న సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన రామారావు మాట్లాడుతూ ‘చిన్నప్పట్నుంచీ సినిమాలపై చాలా ఆసక్తి ఉంది. ఆ ప్యాషన్‌‌‌‌తో ఇండస్ట్రీకి వచ్చాను. కొన్ని డబ్బింగ్ సినిమాలు చేసిన తర్వాత తెలుగులో నిర్మించిన  స్ట్రయిట్ మూవీ ఇది.

సత్యదేవ్ చాలా మంచి వ్యక్తి. నేను సెట్స్‌‌‌‌కు వెళ్లక పోయినా అకౌంట్స్‌‌‌‌తో పాటు ప్రతి విషయంలోనూ మాకు సపోర్ట్ చేశారు. తమన్నా ప్రొఫెషనల్ యాక్టర్. ఆమె నటించడంతో మా సినిమాకు మరింత హైప్ వచ్చింది.  చాలా మంది ఈ టైటిల్ చూసి యూత్ సినిమా అనుకుంటారు. కానీ ప్రతి వ్యక్తి టీనేజ్ నుండి మిడిల్ ఏజ్ వరకు  ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటారు. ఒక్కోసారి అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే విధానంలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. అలాగే ప్రేమ విషయంలో జరుగుతాయి.  వాటిలో విలువైన ప్రేమలు కొన్నే ఉంటాయి.

ఆ విలువైన ప్రేమలు ఎలా ఉండాలి, ఎలా ఉంటాయో, సమాజానికి తగ్గట్టు మనం ఎలా ఉండాలో తెలియజేసే చిత్రం ఇది. ఈ సినిమా చూస్తుంటే నాగార్జున గారి ‘గీతాంజలి’ గుర్తొస్తుంది. మనసుకు హత్తుకునేలా ఉంటుంది’ అన్నారు.