అప్పుడే పుట్టిన పిల్లలకు యాంటీబయోటిక్స్​ వద్దు

అప్పుడే పుట్టిన పిల్లలకు యాంటీబయోటిక్స్​ వద్దు

మెల్​బోర్న్: ఇన్ఫెక్షన్లను నివారించేందుకు అప్పుడే పుట్టిన పిల్లలకు యాంటీబయోటిక్స్​ ఇస్తే పెద్దయ్యాక వారిలో జీర్ణసంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తాజా స్టడీలో తేలింది. నెలలు నిండక ముందే లేదా తక్కువ బరువుతో పుట్టిన బేబీలకు డాక్టర్లు యాంటీబయోటిక్స్​ ఇస్తుంటారని మెల్​బోర్న్​ వర్సిటీ పరిశోధకులు చెప్పారు. దీనివల్ల పెద్దయ్యాక వారిలో గ్యాస్ట్రోఇంటెస్టినల్​ సమస్యలకు కారణమవుతోందని వివరించారు.

అప్పుడే పుట్టిన ఎలుకలకు యాంటీబయోటిక్స్​ఇచ్చి పరీక్షించగా..  పెద్దయ్యాక ఆ ఎలుకల నాడీ వ్యవస్థ, పేగులపై యాంటీబయోటిక్స్ ప్రభావం కనిపించిందన్నారు. డయేరియా వంటి లక్షణాలు కూడా ఆ ఎలుకల్లో కనిపించినట్లు పేర్కొన్నారు.