జనవరి 16 లోపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: గుత్తా సుఖేందర్ రెడ్డి

జనవరి 16 లోపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: గుత్తా సుఖేందర్ రెడ్డి

వచ్చే ఏడాది జనవరి 16 లోపు తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం  కేంద్రం జిమ్మిక్కులు  చేస్తుందన్నారు.  ఎన్నికలు దగ్గర పడ్డాయాంటూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తుందని విమర్శించారు.   ఎన్నికలు ఎప్పుడొచ్చినా మూడో సారి కేసీఆర్ సీఎం అవుతారని ధీమావ్యక్తం చేశారు.రాష్ట్రాల్లో, కేంద్రంలో మోడీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందన్నారు.కేటీఆర్ సమర్థత తో హైదరాబాద్ విశ్వ నగరంగా మారుతుందన్నారు.

వైఎస్ షర్మిల లాంటి సమైక్య వాదులు రాష్ట్రంలో చొరబడ్డారని విమర్శించారు గుత్తా.   తెలంగాణా వ్యతిరేకులంతా ఏకం అవుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు జానా, కోమటిరెడ్డి, ఉత్తమ్ తలా ఒకదారి ఎంచుకున్నారని..కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మతి బ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.  రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్  మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు.