
హుజురాబాద్ లో ప్రవేశపెట్టిన పథకాలు గత బడ్జెట్ లో పెట్టినవే..ఇపుడు అమలు చేస్తున్నామన్నారు శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి . బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాబోయే ఎన్నికల్లో తాము అధికార లోకి వస్తామని పగటి కలలు కంటున్నారన్నారు . ఎన్ని పగటి కలలు కన్నా రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. మంత్రి జగదీష్ రెడ్డి చేతిలో నుంచి మైక్ లాక్కోవడాన్ని తప్పుబట్టారు. ఎమ్మెల్యేగా ఉండి ఒక మంత్రిని అవమానించడం,దాడికి ప్రయత్నంచడం సరైంది కాదన్నారు. నాయకులు ప్రాంత అభివృద్ధి కొరకు పోటీపడాలి తప్ప ఒకరిని ఒకరి కించపరిచే విధంగా ఉండద్దొన్నారు.