జిల్లాల్లో ఎమ్మెల్సీలకు ప్రొటోకాల్ ​ఇస్తలేరు

జిల్లాల్లో ఎమ్మెల్సీలకు ప్రొటోకాల్ ​ఇస్తలేరు

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీలకు జిల్లాల్లో ప్రొటోకాల్​ కల్పించడం లేదని శాసన మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్ ​రెడ్డి అన్నారు. ఈ విషయంలో అనేక సంద ర్భాల్లో ఎమ్మెల్సీలు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. ఇకనైనా వివాదాలు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అసెంబ్లీ, కౌన్సిల్​సమావేశాల నిర్వహణపై మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్​లో స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​ రెడ్డి, లెజి స్లేటివ్ ​అఫైర్స్​ మినిస్టర్​ వేముల ప్రశాంత్​ రెడ్డితో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ నెల 3వ తేదీ నుంచి జరిగే సమావేశాలకు అందరూ సహకరించాలన్నారు. మండలి సమావేశాలకు అధికారులు తప్పకుండా హాజరుకావాలని,  సమన్వయంతో ఉభయ సభలు సజావుగా నడిచేలా చూడాలన్నారు.

మనం ప్రజలకు జవాబుదారీ 

సభ హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని స్పీకర్​పోచారం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. మనమందరం ప్రజలకు జవాబుదారీ అని, వాళ్లకు అన్ని విషయాలు తెలియజేయాల్సిన అవసరం సభకు ఉందన్నారు. గతంలో బడ్జెట్​పై చర్చే సజావుగా సాగేది కాదని, ఇప్పుడు డిమాండ్స్​పైనా చర్చించి ఆమోదిస్తున్నామని మంత్రి ప్రశాంత్​రెడ్డి అన్నారు. స్పీకర్, మండలి చైర్మన్​సూచన మేరకు కొత్త ప్రొటోకాల్ ​డ్రాఫ్ట్​ బుక్​ తయారు చేయాలని, దానికి అనుగుణంగా ప్రొటోకాల్ ​పాటించాలని అధికారులను ఆదేశించారు.