తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందింది: గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందింది: గుత్తా సుఖేందర్ రెడ్డి

నార్కట్​పల్లి,వెలుగు: సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం  నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండల కేంద్రంలో నిర్మించనున్న యాదవ, గౌడ సంఘ, ఆర్ఎంపీ యూనియన్ భవనాలు, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య , ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. 

Also Read : చింతలపాలెం కాంగ్రెస్ నాయకుల్ని వేధిస్తున్నరు

ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ఆగొద్దంటే మళ్లీ కేసీఆర్ నే సీఎం చేయాలని ప్రజలకు సూచించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం అడ్డుపుల్లలు వేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి గవర్నర్ గా ఉండి అభివృద్ధి కి అడ్డుపడటం రాజ్యాంగ విరుద్ధామన్నారు. దాసోజు శ్రవణ్ , కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా తిరస్కరించి గవర్నర్ బీజేపీ నాయకురాలిగా వ్యవహరించారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెగట్టే మల్లికార్జున్ రెడ్డి, మండల ప్రజాప్రతినిధులు, స్థానిక బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు .