
తెలంగాణలో టిఆర్ఎస్కు బిజెపియే ప్రత్యామ్నాయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. బీఆర్ఎస్కు ఇక వీఆర్ఎసే అని చురకలంటించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చూసి కేసీఆర్కు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే విజయమని జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకు పైగా విజయం సాధిస్తుందని చెప్పారు.దేశంలో విపక్షాలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. బీజేపీతోనే దేశాభివృద్ధి, సమస్యల పరిష్కారం సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు.