జ్ణానవాపి కాంప్లెక్స్ ను మసీదు అనలేం : సీఎం సంచలన వ్యాఖ్యలు

జ్ణానవాపి కాంప్లెక్స్ ను మసీదు అనలేం : సీఎం సంచలన వ్యాఖ్యలు

యూపీలో వివాదాస్పద  జ్ఞాన్‌వాపి మసీదు  కేసు కోర్టులో ఉండగా  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞాన్‌వాపిని  మసీదు అనలేమని..అలా అనడం వివాదమే అవుతుందన్నారు.   న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.   జ్ఞానవాపిలో  త్రిశూలం ఉందని.. అందులో దేవుడి విగ్రహాలు ఉన్నాయన్నారు. ముస్లీంలే   ఈ చారిత్రక తప్పిదాన్ని   అంగీకరించి జ్ఞానవాపిని  అప్పగించాలని కోరారు.  ఈ సమస్య పరిష్కారానికి ముస్లీంలే  పరిష్కారం తీసుకురావాలన్నారు.

జ్ఞానవాపి ఆవరణలో ఏఎస్‌ఐ సర్వేపై స్టేను అలహాబాద్‌ హైకోర్టు ఆగస్టు 3 వరకు పొడిగించింది. వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వులపై ఆ రోజే తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించింది. అప్పటివరకు తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు జులై 27న  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రీతింకర్‌ దివాకర్‌ తెలిపారు. ఈ క్రమంలో సీఎం యోగి వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి.