
హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన జిమ్నాస్ట్ అంజనా గునుకుల సింగపూర్‌లో జరుగుతున్న బియాంకా పనోవా ఇంటర్నేషనల్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ కప్‌లో మూడు పతకాలు గెలిచింది. ఈ టోర్నీలో నగరానికి చెందిన అలికా జో న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
ఆమె నిర్వహిస్తున్న జిమ్నాస్టిక్స్ అకాడమీకి చెందిన అంజనా హూప్, బాల్, ఆల్‌రౌండ్ ఇండివిజువల్ అపారేటస్ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలను సొంతం చేసుకుంది. ఆల్‌రౌండ్ ఇండివిజువల్ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానం సాధించింది. ఈ టోర్నీలో 18 దేశాల నుంచి 209 జిమ్నాస్ట్‌లు పోటీ పడుతున్నారు.