
హైదరాబాద్, వెలుగు: సీబీఎస్‌సీ నేషనల్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జిమ్నాస్ట్ సీహెచ్ డయానా గ్రేస్ సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. మహారాష్ట్రలోని సాధ్వి ప్రీతిసుధాజీ ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో గోల్డ్ సహా మూడు మెడల్స్ గెలిచింది.
హైదరాబాద్ చందానగర్‌లోని కార్నర్‌స్టోన్ స్కూల్ స్టూడెంట్ అయిన డయానా అండర్17 గర్ల్స్ టేబుల్ వాల్ట్‌లో అత్యధికంగా 11 పాయింట్లతో టాప్ ప్లేస్‌తో గోల్డ్ నెగ్గింది. అన్‌ఈవెన్ బార్స్‌లో 7.55 పాయింట్లతో జాయింట్ థర్డ్ ప్లేస్‌తో కాంస్యం, ఆల్ రౌండ్ విభాగంలో 36.20 పాయింట్లతో మరో కాంస్యం ఖాతాలో వేసుకుంది. అండర్14 బాయ్స్ పామెల్ హార్స్ ఈవెంట్‌లో డానియల్ మూడో ప్లేస్‌తో బ్రాంజ్ నెగ్గాడు.