
వాషింగ్టన్: హెచ్1బీ వీసాల ఫీజును పెంచుతూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నెట్‌ఫ్లిక్స్ కోఫౌండర్ రీడ్ హాస్టింగ్స్ స్వాగతించారు. హెచ్1బీ వీసా సమస్య పరిష్కారానికి ఇదొక గొప్ప పరిష్కారమని ప్రశంసించారు.
‘‘హెచ్1బీ రాజకీయాలపై నేను 30 ఏండ్లు పని చేశాను. ఈ వివాదాస్పద స్కీమ్‌కు ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజు ఓ గొప్ప పరిష్కారం. ఇలా చేయడం వల్ల అధిక ప్రాధాన్యం ఉన్న జాబ్స్‌కే హెచ్1బీ వీసాలు పరిమితమవుతాయి. ఇకపై లాటరీ తీయాల్సిన అవసరం ఉండదు” అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో హాస్టింగ్స్ పోస్టు పెట్టారు. అమెరికాను ట్రంప్ నాశనం చేస్తున్నారంటూ గతంలో విమర్శించిన ఆయన.. ఇప్పుడు ప్రెసిడెంట్‌పై ప్రశంసలు కురిపించారు.