
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్ సహా గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్‌లలో H3N2 ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. H3N2 అనేది ఒక రకమైన వైరస్. ఇది సోకితే సాధారణ జలుబు కంటే చాలా ఎక్కువగా, ఎక్కువకాలం పాటు ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు చాల ఇబ్బంది కలిగించొచ్చు. వైద్య నిపుణులు ప్రకారం H3N2 ఫ్లూ లక్షణాలను ముందుగానే గుర్తించి, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
H3N2 వైరస్ అంటే ఏమిటి: H3N2 అనేది ఒక వైరస్ రకం. వ్యాక్సిన్‌ల వల్ల ఏర్పడిన రోగనిరోధక శక్తిని తప్పించుకోగలదు. అందుకే ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సిన్‌లను అప్‌డేట్ చేస్తూ ఉంటారు.
H3N2 ఎలా వ్యాపిస్తుంది: ఈ వైరస్ తుమ్ము, దగ్గు, దగ్గరగా మాట్లాడినప్పుడు గాలిలో నుండి వ్యాపిస్తుంది. అంతేకాకుండా, ఈ వైరస్ గాలిలో కొన్ని గంటల పాటు ఉంటుంది. రద్దీగా ఉండే ప్రదేశాలలో, వెంటిలేషన్ లేని చోట్ల ఇంకా జనసంద్రం ఉన్న చోట సులభంగా వ్యాపిస్తుంది.
H3N2 ఫ్లూ లక్షణాలు: జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, జలుబు, నీరసం, వంటీ నొప్పులు, ఒకోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీ నొప్పి సమస్యలు రావచ్చు. చివరికి న్యుమోనియా లేదా బ్రోన్కైటిస్ వంటి సమస్యలకు దారితీయవచ్చు.
►ALSO READ | ధూమపానం ఒక్కటే కాదు, ఈ అలవాట్లు కూడా మీ ఊపిరితిత్తులను పాడుచేస్తాయి!
పిల్లలు ఎందుకు ప్రమాదం: పిల్లలకు H3N2 ఫ్లూ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారికీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి. స్కూల్స్, గేమ్స్ ఆడేటప్పుడు ఒకరి నుండి ఒకరికి వైరస్ త్వరగా వ్యాపిస్తుంది. దింతో జ్వరం డీహైడ్రేషన్ రావొచ్చు. వృద్ధులు కూడా H3N2 ఫ్లూ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. డయాబెటిస్, ఆస్తమా, గుండె జబ్బులు వ్యాధులు ఉన్నవారు చాల జాగ్రత్తగా ఉండాలి.
జాగ్రత్తలు: పిల్లలు, వృద్ధులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. అలాగే చేతులు బాగా శుభ్రం చేసుకోవాలి. సబ్బు లేదా హ్యాండ్ శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలి. రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించడం మంచిది. ఏదైనా లక్షణాలు అనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.