సోనూ సూద్ ఇంటి వద్ద జనం క్యూ

సోనూ సూద్ ఇంటి వద్ద జనం క్యూ

సోనూ సూద్.. పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్‌‌తో పాటు బాలీవుడ్ చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించి నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతినాయకుడిగా పలకరించి..భయపెట్టిన ఈ హీరో  నిజజీవితంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందడుగు వేస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. అలాంటి హీరో జన్మదినం వస్తే.. సందడి మాములుగా ఉండదు. ఎంతో మంది ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ.. తన పుట్టిన రోజున కొంతమంది ప్రత్యేక అతిథులు వచ్చి తనను ఆశీర్వదించారని సోనూ సూద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వారు వచ్చిన సమయంలో భావోద్వేగానికి గురయ్యాయని వెల్లడించారు. ఆయన పోస్టు చేసిన ఫొటోల్లో కారుకు ఇరువైపులా భారీ సంఖ్యలో ప్రజలు నిల్చొన్నారు. అందులో రెండు కళ్లు లేని ఓ వ్యక్తి చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని ఉన్నాడు.

అతడిని సోనూ ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. మరో వృద్దురాలు సోనూ సూద్ ని ఆశీర్వదించింది. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి సోనూ కృతజ్ఞతలు తెలియచేశారు. కొవిడ్ టైమ్‌లో అతనిలోని  కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సోనూలో ఎంత గొప్ప వ్యక్తి ఉన్నాడో అందరికీ తెలిసొచ్చింది. కరోనా విజృంభిస్తుంటే ప్రజలు పడుతున్న కష్టాలు చూసి సోనూ కదిలిపోయాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. కరోనా తర్వాత కూడా సోనూ సేవలు ప్రజలకు అందుతూనే ఉన్నాయి. ఎక్కడ ఎవరు కష్టంలో ఉన్నారని తెలిసినా వెంటనే రియాక్టవుతాడు. రోజూ తన ఇంటి  గేటు దగ్గరకొచ్చి నిలబడే ప్రతి ఒక్కరి బాధనూ ఓపికగా విని చేయగలిగినంత సాయం చేసి పంపిస్తాడు. తన నటనతో మంచి మనసుతో మరిన్ని మన్ననలు అందుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.