రాష్ట్రంలో నిన్నటి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో రాళ్లవాన కురిసింది. జిల్లాలోని దోమకొండ, మాచారెడ్డి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో రాళ్లతో కూడిన వర్షం కురిసింది. దోమకొండ మండల కేంద్రంలోని జనగామలో, బిక్కనూర్ మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో వడగండ్ల వాన కురవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షమా లేక మంచు గడ్డలు కురుస్తున్నాయా అనేలా వడగండ్ల వాన కురిసిందని స్థానికులు అంటున్నారు.
For More News..
