మృతులంతా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వెళ్లినవారే.. సౌదీ బస్సు ప్రమాదంపై హజ్ హౌస్ క్లారిటీ..

మృతులంతా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వెళ్లినవారే.. సౌదీ బస్సు ప్రమాదంపై హజ్ హౌస్ క్లారిటీ..

సోమవారం ( నవంబర్ 17 ) తెల్లవారుజామున సౌదీలో జరిగిన బస్సు ప్రమాదం ప్రకంపనలు రేపుతోంది. ఇండియా నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లిన యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనడంతో 42 మంది సజీవదహనం అయ్యారు. మృతి చెందినవారిలో 16 మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై హజ్ హౌస్ స్పందించింది. ఈ ప్రమాదంలో మృతి చెందినవారంతా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వెళ్లినవారేనని.. హజ్ హౌస్ నుండి ఎవరు వెళ్లలేదని స్పష్టం చేసింది.

ఇప్పుడు హజ్ యాత్రకు వెళ్లే సమయం కాదని.. హజ్ అంటే ఏడాదికి ఒకసారి వెళ్లే యాత్ర అని తెలిపింది హజ్ హౌస్.ఉమ్రా యాత్ర. అంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లవచ్చని.. అది ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వెళ్తారని తెలిపింది హజ్ హౌస్. హజ్ యాత్రకు ఉమ్రా యాత్రకు సంబంధం ఉండదని తెలిపింది హజ్ హౌస్.

ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో ఎవరూ హజ్ హౌస్ ద్వారా వెళ్లలేదని స్పష్టం చేసింది. మృతి చెందినవారంతా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వెళ్లినవారేనని తెలిపింది హజ్ హౌస్. ఈ ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 42 మంది మృతి చెందారు. మృతుల్లో హైదరాబాద్‌ మల్లేపల్లిలోని ఉమ్రా ట్రావెల్స్‌కు సంబంధించిన 16 మంది యాత్రికులు ఉన్నారు. సీఎం ఆదేశాలతో సహాయక చర్యల కోసం తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు.కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు: 79979 59754, 99129 19545