
గచ్చిబౌలి, వెలుగు: ప్రధాని మోదీ వరంగల్ పర్యటనలో భాగంగా ఇయ్యాల స్పెషల్ ఫ్లైట్‌లో మేడ్చల్ జిల్లాలోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వరంగల్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చుట్టూ 5 కి.మీ పరిధిలో
నో ఫ్లైయింగ్ జోన్‌గా ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డిస్టెన్స్‌లో డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో ఎయిర్ క్రాఫ్ట్‌ల అనుమతిని నిషేధించామని.. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సీపీ తెలిపారు. ఈ ఆంక్షలు ప్రధాని పర్యటన ముగిసే వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.