చేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

చేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
  • ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: చేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. శుక్రవారం తెలంగాణ చేనేత కార్మిక సంఘం నాయకులతో కలిసి ఆయన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని చేనేత జౌళి శాఖ కార్యాలయంలో కమిషనర్ శైలజా రామయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు లక్ష కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని, సంక్షోభంలో కోరుకుపోయిన చేనేత రంగాన్ని గట్టెక్కించాలని విజ్ఞప్తి చేశారు. 

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రకటించిన పథకాలు, హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. టెస్కో కొనుగోలు చేసిన వస్త్రాలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో వడ్డీల భారం పెరిగి చేనేత సహకార సంఘాలు అప్పుల్లో కూరుకుపోయాయన్నారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.