ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జూబ్లీ హిల్స్‌‌‌‌‌‌‌‌ విజయంపై సంబురాలు

 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా  జూబ్లీ హిల్స్‌‌‌‌‌‌‌‌ విజయంపై సంబురాలు

కరీంనగర్ సిటీ/జగిత్యాల రూరల్‌‌‌‌‌‌‌‌/ వెలుగు: జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలోని ఇందిరా చౌక్ వద్ద సుడా చైర్మన్ కోమటి రెడ్డి  నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, స్వీట్లు పంచి కార్యకర్తలు నాయకులతో కలిసి డ్యాన్స్ చేశారు. 

అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌‌‌‌‌‌‌‌లో సంబరాలు నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్ రావు హైదరాబాద్ లో నవీన్‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌ను కలిసి అభినందనలు తెలిపారు. 

జగిత్యాల కొత్తబస్టాండ్‌‌‌‌‌‌‌‌ చౌరస్తాలో నిర్వహించిన సంబురాల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, లక్ష్మణ్, శ్రీనివాస్,లావణ్య, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. రామడుగు, జమ్మికుంట, హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌, మల్యాల,  మల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోరుట్ల, మంథని, కోనరావుపేట, శంకరపట్నం మండలకేంద్రాల్లో పార్టీ లీడర్లు, కార్యకర్తలు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు.