ఆదిలాబాద్, వెలుగు: విద్యార్థులు, యువత ర్యాగింగ్, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని జిల్లా జడ్జి ప్రభాకర్ రావు సూచించారు. శుక్రవారం సాయంత్రం రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సుకు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ర్యాగింగ్, డ్రగ్స్ వంటి దురలవాట్లు జీవితాన్ని అంధకారంలోకి నెట్టివేస్తాయని చెప్పారు.
అవి తీవ్రమైన నేరాలని, కఠిన శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మంచి అలవాట్లు, స్నేహాలు, లక్ష్యాలు మాత్రమే ఉజ్వల భవిష్యత్తుకు దారి చూపుతాయని పేర్కొన్నారు. . అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజ్యలక్షి, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ తదితరులున్నారు.
