మున్సి‘పోల్’లో మహిళలే కీలకం

మున్సి‘పోల్’లో మహిళలే కీలకం

గ్రామ పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో పురుషులతో సమానంగా అధికారాన్ని దక్కించుకున్న మహిళలు..త్వరలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ తమదైన ముద్రను వేయనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో తమ రాజకీయ సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వని బంధనల ప్రకారం స్థానిక ఎన్ని కల్లో మహిళలకు 50శాతం రిజర్వే షన్ల అమలు అనివార్యం . వీటితోపాటు జనరల్‌ స్థా నాల్లో నూ పోటీ చేసేందుకు మహిళలకు సైతం అవకాశం ఉంటుంది .ఇది వరకు జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ మహిళాలకు సగం రిజర్వే షన్లు కేటాయించారు. మరికొంత మంది మహిళాలను జనరల్ స్థానాల్లో పోటీకి నిలబెట్టా రు. ఇదే రీతిలో మున్సిపల్‌ ఎన్నికల్లోనూ మహిళాలకు అదే స్థాయిలో స్థానం దక్కనుంది .

జిల్లా లో 183 స్థా నాలు మహిళలకు
రంగారెడ్డి జిల్లా లో 12 మున్సిపాలిటీలు, 3 కార్పోరేషన్లను రాష్ ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది .వీటిల్లో 6 మున్సిపాలిటీలకు చైర్మన్లు గా, ఒక కార్పొరేషన్ కు మేయర్ గా మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. 12 మున్సిపాలిటీల్లో 251 వార్డులు ఉండగా వాటిల్లో మహిళలకు 126 వార్డులు రిజర్వు కానున్నాయి. అదేవిధంగా 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వంద డివిజన్లను ఉండగా వాటిలో 50 డివిజన్లు మహిళలకు కేటాయి స్తారు. మొత్తంగా 351 వార్డులకుగాను 176 వార్డుల్లో మహిళల కోసం రిజర్వు కానున్నాయి. మహిళా రిజర్వు స్థానలతో పాటుఇతర జనరల్ స్థా నాల్లో నూ మహిళలు పోటీచేసే అవకాశాలు లేకపోలేదు. దాంతో త్వరలో ఏర్పడనున్న కౌన్సిల్ లో పురుషుల కంటే మహిళల స్థానాలే అధికంగా ఉండనున్నాయి. ఓటర్లసంఖ్య ప్రకారం రిజర్వే షన్లను ప్రకటించినప్పటికీ ఆయా కేటగిరీల వారీగా సగం సీట్లు వారికి తప్పనిసరిగా కేటాయించాల్సిన ఆవశ్యకత ఉంటుంది .
రాజకీయ చైతన్యం
స్థా నిక సంస్థల్లో 50 శాతం రిజర్వే షన్ల వల్ల మహిళలు రాజకీయంగా చైతన్యవంతులవుతున్నారు. అనేక మంది రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో నిమగ్నం అవుతున్నారు. ఎన్నికల ద్వారా వచ్చిన వచ్చిన అవకాశాన్ని సద్వి నియోగం చేసుకుంటు న్నారు. కొందరు మహిళలు రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ప్రజా సమస్యలను సభలో లేవనెత్తు తూ వాటి పరిష్కారానికి కృషిచేస్తున్నారు.