హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి, మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో నల్లగొండ పీడీ వై.శేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ కాల్సాని చంద్రశేఖర్, అలుగుల బ్రహ్మారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
