ఆ 6 వేల మందిని వదిలి.. మీ వాళ్లను తీసుకెళ్లండి : హమాస్ ట్విస్ట్ తో ఇజ్రాయిల్ షాక్

ఆ 6 వేల మందిని వదిలి.. మీ వాళ్లను తీసుకెళ్లండి : హమాస్ ట్విస్ట్ తో ఇజ్రాయిల్ షాక్

వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ఇజ్రాయిల్‌పై విధ్వంసకర దాడిని ప్రారంభించిన హమాస్ సైన్యం.. కిడ్నాప్ చేసిన దాదాపు 200 మంది బందీలకు బదులుగా 6వేల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ జైళ్ల నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. అక్టోబర్ 16న ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) హమాస్, ఇతర పాలస్తీనా మిలిటెంట్లు గాజాలో 199 మంది బందీలుగా ఉన్నారని తెలిపారు. ఇది మునుపటి అంచనాల కంటే కనీసం 44 మంది ఎక్కువ. ఈ విషయంపై వారి కుటుంబాలకు సమాచారం అందించామని సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు.

హమాస్ స్వాధీనం చేసుకున్న బందీలలో ఐడీఎఫ్ గాజా విభాగానికి చెందిన ఉన్నత స్థాయి అధికారులు కూడా ఉన్నారు. వారు గాజా స్ట్రిప్ చుట్టూ గస్తీకి బాధ్యత వహిస్తారని స్కై న్యూస్ తెలిపింది. ఇజ్రాయిల్ భారీ బాంబు దాడి కారణంగా బందీలుగా ఉన్న వారిలో ఎంతమంది సజీవంగా ఉన్నారో తనకు తెలియదని మరో హమాస్ అధికారి తెలిపారు.