మాదాపూర్​లో..ఫ్యాషన్​ షో అదరహో

మాదాపూర్​లో..ఫ్యాషన్​ షో అదరహో

మాదాపూర్​లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్​లో హామ్స్ టెక్ ఫ్యాషన్–2024 శుక్రవారం ఉత్సాహంగా సాగింది.  వివిధ ఫ్యాషన్ డ్రెస్సులో హామ్స్ టెక్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్లు ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. సస్టెనబిలిటీ థీమ్​తో 200 మంది డిజైనర్లు, వెయ్యికి పైగా డిజైన్లతో తమ క్రియేటివ్ కలెక్షన్లను ప్రదర్శించారు. 

ఈ ఫ్యాషన్ షో ద్వారా స్టూడెంట్లకు వారి కలెక్షన్లను ప్రదర్శించే అవకాశం కల్పించామని హామ్స్ టెక్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ అజితా రెడ్డి తెలిపారు.  స్టూడెంట్ల కాన్ఫిడెన్స్, నెట్ వర్క్​ను తెలుసుకోవడానికి ఈ షో ఉపయోగపడుతుందని నేషనల్ అవార్డ్ విన్నర్, ఫ్యాకల్టీ నీతా లుల్లా పేర్కొన్నారు.