
ఈ నెల 23న ప్రధాని మోడీని దేశ ప్రజలు తిరస్కరించటం ఖాయమన్నారు AP సీఎం చంద్రబాబు నాయుడు. మ్యాచ్ లో అంప్లైర్లు లేకుండా చేసి, రిఫరీ సిస్టమ్ నే ధ్వంసం చేసేలా వ్యవహరిస్తున్నారని మోడీపై మండిపడ్డారు. ట్వీట్టర్లో స్పందించిన బాబు… నిబంధనల ప్రకారం సక్రమంగా ఆడే కొత్త టీమ్ ను ప్రజలే ఎంపిక చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారన్నారు. తమ పోరాటం ఎన్నికల సంఘంపై కాదు… అధికారుల వివక్షత, పక్షపాత దోరణిపైనేనన్నారు.
రాజకీయ లబ్ధికోసం ఎప్పుడో చనిపోయిన నాయకులను, చివరికి నాయకుల కుటుంబ సభ్యులను కించపరిచేందుకు కూడా మోడీ వెనుకాడరన్నారు. రక్షణశాఖను, సైన్యాన్ని వాడుకుంటూ మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల షెడ్యూల్ కు 73 రోజులు తీసుకున్న ఈసీకి 50 శాతం వీవీప్యాట్ ల లెక్కింపునకు మరో 6 రోజులు తీసుకోవడానికి ఎందుకంత అభ్యంతరమని ప్రశ్నించారు.