శ్రీశైలం, సాగర్ రూల్‌‌ కర్వ్​కు ప్రామాణికమేంటి ?

శ్రీశైలం, సాగర్ రూల్‌‌ కర్వ్​కు ప్రామాణికమేంటి ?

హైదరాబాద్‌‌, వెలుగు: కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు అక్రమంగా తరలించేలా హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల విస్తరణ చేపడుతున్నారని తెలంగాణ ఆక్షేపించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 ప్రకారం కృష్ణా జలాలపై ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం, ఆప్రైజల్ తప్పనిసరి అని గుర్తుచేసింది. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టుల విస్తరణను అడ్డుకోవాలని కేఆర్ఎంబీ చైర్మన్ మహేంద్ర ప్రతాప్‌‌సింగ్‌‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం లేఖ రాశారు.

దీంతో పాటు కేంద్ర అటవీ, పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఏపీ రాష్ట్ర స్థాయి పర్యావరణ మదింపు అథారిటీలకు లేఖ రాస్తూ ఆయా ప్రాజెక్టులకు ఇచ్చిన పర్యావరణ అనుమతిని అమలు కాకుండా అబేయన్స్​లో పెట్టాలని కోరింది. బేసిన్ అవతలికి నీరందించే హంద్రీనీవా, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులపై కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్ 2 (కేడబ్ల్యూడీటీ)లో ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేశామని గుర్తుచేసింది. కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు అక్రమంగా తరలించే ఈ ప్రాజెక్టుల విస్తరణను అడ్డుకోవాలని పలు దఫాలుగా కృష్ణా బోర్డును కోరుతూ లేఖలు రాశామని వివరించింది. .

శ్రీశైలం, సాగర్ రూల్‌‌ కర్వ్​కు ప్రామాణికమేంటి ?

శ్రీశైలం, నాగార్జునసాగర్ రూల్‌‌ కర్వ్ ముసాయిదా రూపొందించడానికి ఎలాంటి ప్రామాణికాలు తీసుకున్నారని, ఏ ప్రాతిపదికన ముసాయిదా సిద్ధం చేశారో ఆధారాలతో సహా డాక్యుమెంట్లు ఇవ్వాలని కేఆర్‌‌ఎంబీని మురళీధర్ కోరారు.  ఈ నెల 4న 4వ ఆర్ఎంసీ సమావేశం జరగగా, దీనికి ఒక్కరోజు ముందే ప్రాజెక్టుల రూల్ కర్వ్ ముసాయిదా ఎలా సిద్ధం చేశారో వివరాలు ఇవ్వాలన్నారు. దీనికి కేఆర్ఎంబీ స్పందిస్తూ, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించడానికే సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపింది. దీనిపై తాజాగా తెలంగాణ అధికారులు మళ్లీ లేఖ రాశారు. శ్రీశైలం, సాగర్‌‌‌‌ రూల్‌‌ కర్వ్‌‌కు తుదిరూపు ఇచ్చే ముందు ఏ పత్రాలు దీనికి ప్రామాణికం అయ్యాయో తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.