హ్యాంగ్‌‌మెన్ గొప్ప చిత్రం: బ్రహ్మాజీ

హ్యాంగ్‌‌మెన్ గొప్ప చిత్రం: బ్రహ్మాజీ

బ్రహ్మాజీ లీడ్ రోల్‌‌లో విహాన్ దర్శకుడిగా వి. శ్రీకాంత్, అజయ్ మైసూర్, వి.హెచ్. రావు నిర్మించిన  చిత్రం ‘హ్యాంగ్‌‌మెన్’. సన్‌‌నెక్స్ట్ ఓటీటీలో  జులై 3నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. మంగళవారం ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు.  నటుడు బ్రహ్మానందం, దర్శకురాలు నందినీ రెడ్డి, అద్దంకి దయాకర్  అతిథులుగా హాజరై ఇలాంటి గొప్ప చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరారు. 

ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ ‘ఇలాంటి కథకు నన్ను అనుకున్న విహాన్‌‌కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం  ఉంటుంది’ అని అన్నాడు. విహాన్ మాట్లాడుతూ ‘మనం చేసే ఉద్యోగాల్లా ‘హ్యాంగ్‌‌మెన్’ జాబ్ ఉండదు. కొత్త సబ్జెక్ట్, కంటెంట్ వచ్చినప్పుడల్లా ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. అందుకే ‘హ్యాంగ్‌‌మెన్’ కథను రాసుకున్నా’ అని చెప్పాడు.  నటుడు సన్నీ, రియల్ హ్యాంగ్‌‌మెన్ పవన్,  మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్, ఎడిటర్ కార్తిక్ పాల్గొన్నారు.