కాకతీయ వనవిహార్ లో అగ్నిప్రమాదం..హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పార్క్ లో ఘటన

కాకతీయ వనవిహార్ లో అగ్నిప్రమాదం..హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పార్క్ లో ఘటన

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కాకతీయ వన విహార్(అర్బన్  పార్క్)లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కెనాల్ ను ఆనుకొని ఉన్న ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో జామాయిల్  తోట వైపు మంటలు విస్తరించాయి. సిబ్బంది ఫైరింజన్ కు సమాచారం ఇవ్వగా, ఫైర్  ఇంజన్​ మంటల వరకు చేరుకునే అవకాశం లేకుండా పోయింది. 

86 ఎకరాల్లో పార్క్​ విస్తరించి  ఉండగా, ఇందులో కంక వనం, జామాయిల్, నక్షత్ర వనం, రాశివనం, నవగ్రహ వనంతో పాటు వివిధ రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. రూ.6 కోట్లతో ప్రభుత్వం ఈ పార్క్​ను అభివృద్ధి చేసింది. మంటలు అదుపులోకి రాకపోతే కలప, కంకవనం అగ్నికి ఆహుతయ్యే అవకాశం ఉంది.