Prabhas Fauzi టైటిల్ పోస్టర్ డీకోడ్.. ఒక్క పోస్టర్తోనే.. ఇన్ని విషయాలు చెప్పేసిన హను రాఘవపూడి !

Prabhas Fauzi టైటిల్ పోస్టర్ డీకోడ్.. ఒక్క పోస్టర్తోనే.. ఇన్ని విషయాలు చెప్పేసిన హను రాఘవపూడి !

ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. ప్రభాస్ (Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. ముందు నుంచి చెప్పినట్టుగానే ఈ సినిమా పేరు ‘ఫౌజీ’(FAUZI). ప్రభాస్ ఇంటెన్స్ లుక్తో కూడిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంది. అయితే.. ఈ టైటిల్ పోస్టర్ రివీల్ చేసిన సందర్భంలో.. సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఏంటో సంస్కృత శ్లోకం రూపంలో చెప్పేశారు.

పద్మవ్యూహ విజయి పార్ధః-పద్మవ్యూహంలో (చక్రవ్యూహంలో) విజయం సాధించినది పార్ధుడు (అర్జునుడు), పాండవపక్షే సంస్థిత కర్ణః-పాండవుల పక్షాన నిలిచినవాడు కర్ణుడు, గురువిరహితః ఏకలవ్యః – గురువు లేకుండా విద్య నేర్చుకున్నవాడు ఏకలవ్యుడు, జన్మనైవ చ యోద్ధా ఏషః – జన్మతోనే యోధుడు.. అని ఫౌజీ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండనుందో హను రాఘవపూడి మైథలాజికల్గా చెప్పిన విధానం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఈ టైటిల్ పోస్టర్ను నిశితంగా గమనిస్తే.. ఫౌజీ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు తెలుస్తాయి. బ్రిటన్ జెండా కాలిపోతూ కనిపించింది. ఆ కాలిపోతున్న బ్రిటన్ జెండాపై ఆపరేషన్-జెడ్ అని వాటర్ మార్క్లా కనిపించింది. 1940లో జరిగే కథ ఫౌజీ సినిమా స్టోరీ అని పోస్టర్పై దర్శకుడు స్పష్టంగా మెన్షన్ చేశాడు. పోస్టర్ పై కూడా 1932  బ్రిటీషర్ల అరాచకాలు పతాక స్థాయికి చేరిన సమయంలో భారతీయుల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం, బానిస సంకెళ్ల నుంచి విముక్తులను చేయడం కోసం పోరాడిన యోధుడి కథనే ‘ఫౌజీ’ అని తేలిపోయింది. మన చరిత్రలో చీకటి అధ్యాయాలుగా మిగిలిపోయిన ఒక సైనికుడి ధీర గాథ ‘ఫౌజీ’ సినిమా.. అని హను రాఘవపూడి తన ‘ఎక్స్’ ఖాతాలో మెన్షన్ చేశాడు.

►ALSO READ | Ram Charan Upasana: మరో బిడ్డకు తండ్రి కాబోతున్న రాంచరణ్

ఇవన్నీ చూస్తుంటే.. ‘ఫౌజీ’ సినిమా కథకు, నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఇంటర్ లింక్ చేసి హను రాఘవపూడి ఒక పీరియాడిక్ ఫిక్షనల్ స్టోరీ రాసుకుని ఉంటాడనే చర్చ సినీ వర్గా్ల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించిన పోస్టర్లను చూస్తే.. మొదటి పోస్టర్‌లోని తుపాకులు, దానిపై రాసిన ఆపరేషన్ Z, రెండవ పోస్టర్ ఈ సినిమా 1940లో వలస పాలకుల గుప్పిట్లో భారతదేశం చిక్కుకున్న సమయంలో సినిమా సాగుతుందని స్పష్టమైంది.

రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ ఆపరేషన్ Zకు ఇంపార్టెన్స్ ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం, భారతదేశ స్వాతంత్ర్య పోరాటం.. ఈ రెండు అంశాలకు ఫౌజీ కథలో చాలా ఇంపార్టెన్స్ ఉందని Fauzi టైటిల్ పోస్టర్తో తేలిపోయింది. ఒక్క పోస్టర్తోనే ఇన్ని విషయాలను బయటపెట్టాడంటే హను రాఘవపూడికి ఈ కథపై ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చని.. ప్రభాస్ సినీ కెరీర్లో ఇదో మైలు రాయి కావడం ఖాయమని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు.