
హనుమకొండ సిటీ, వెలుగు: ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలందించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలను సోమవారం కలెక్టర్ సందర్శించారు. ఓపీ, ఐపీ సేవలు, డెలివరీ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు.
లేబర్ రూమ్ ను పరిశీలించి వైద్యసిబ్బందిపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ హై రిస్క్ కేసులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకునేలా సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ డీఎంహెచ్వో మదన్ మోహన్ రావు, సూపరింటెండెంట్ విజయలక్ష్మి ఉన్నారు.