ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి : సిక్త పట్నాయక్

ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి : సిక్త పట్నాయక్

ధర్మసాగర్ (వేలేరు), వెలుగు: ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా వేలేరు మండలం ఎర్రబెల్లి నుంచి హనుమకొండ వరకు నూతన ఆర్టీసీ బస్సును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఉచిత బస్సు సౌకర్యం ను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం వసంత, డిప్యూటీ ఆర్ఎం భానుకిరణ్, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ, తహసీల్దార్ కొమి తదితరులు పాల్గొన్నారు.