HanuMan OTT Release: హనుమాన్ ఓటీటీ రిలీజ్పై..జీ5 కీలక ప్రకటన

HanuMan OTT Release: హనుమాన్ ఓటీటీ రిలీజ్పై..జీ5 కీలక ప్రకటన

హనుమాన్ (HanuMan)..ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. సినిమా విడుదలై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికే కొన్ని థియేటర్స్లో రన్ అవుతోంది ఈ సినిమా. ఇటీవలే 50 రోజులు కూడా పూర్తిచేసుకుంది హనుమాన్ మూవీ.

అంతేకాదు..ఇటీవల మహాశివరాత్రి సందర్బంగా మార్చ్ 8న హనుమాన్ సినిమాను ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నట్లు జీ5(ZEE5) అధికారికంగా ప్రకటిం చింది. దీంతో ఆడియన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. శివరాత్రి రోజున ఫ్యామిలీతో కలిసి హనుమాన్ సినిమా చూసేయొచ్చు అని అనుకున్నారు. కానీ, వాళ్ళకి నిరాశే ఎదురైంది. ఆరోజున హనుమాన్ ఓటీటీలో విడుదల కాలేదు. ఈ విషయంపై జీ5 సంస్థ స్పందిస్తూ.. కొన్ని టెక్నీకల్ ఇష్యుస్ కారణంగా హనుమాన్ సినిమాను ఓటీటీలో విడుదల చేయలేకపోయాము. అతి త్వరలో కొత్త డేట్ ను ప్రకటిస్తాము అంటూ చెప్పుకొచ్చారు.

అప్పటినుండి హనుమాన్ కొత్త ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. అయితే..ఇప్పటికీ వారం రోజులు అవుకొస్తున్న..ఇప్పటికీ అప్డేట్ లేకపోయేసరికి ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ ఎక్కువ అయ్యాయి. అలాగే మార్చి 16 నుంచి ఓటీటీలోకి రావచ్చు అంటూ ప్రచారాలు కూడా మొదలయ్యాయి.

ఇక బయట జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ వేస్తూ..ఈ సినిమా డిజిటల్ తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన జీ5 సంస్థ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేసింది. 'మీ సుదీర్ఘ వెయిటింగ్ కి ఒక ఎండ్ పడింది, హనుమాన్ త్వరలో జీ5 లో స్ట్రీమింగ్ కాబోతోంది, తెలుగు భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో హనుమాన్ అందుబాటులో ఉండబోతోంది. ఇతర అప్డేట్స్ కోసం మా ట్విట్టర్ ఐడి ఫాలో అవ్వండి' అంటూ రాసుకొచ్చింది జీ5 టీమ్. త్వరలో పర్ఫెక్ట్ డేట్ వచ్చే అవకాశం ఉంది. 

కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తెరకెక్కించిన హనుమాన్ మూవీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ వస్తున్న విషయం తెలిసిందే.