Manchu Manoj: మనోజ్ భార్య మౌనిక సీమంతం..మంచు ఫ్యామిలీ కనబడదే..?

Manchu Manoj: మనోజ్ భార్య మౌనిక సీమంతం..మంచు ఫ్యామిలీ కనబడదే..?

మంచు మనోజ్ (Manchu Manoj) భార్య భూమా మౌనిక (Bhuma Mounika) ప్రస్తుతం గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏడవ నెలల గర్భవతిగా ఉన్న ఆమె మరో రెండు నెలల్లో తల్లికాబోతున్నారు.

అయితే తాజాగా భూమా మౌనిక సీమంతం చాలా సింపుల్ గా చేసుకున్నారు. ఆళ్లగడ్డలోని మౌనిక పుట్టింటిలో సీమంతం ఫంక్షన్ జరిగింది.ఈ సీమంతం వేడుకను మనోజ్ తన భార్యకు దగ్గర ఉండి  జరిపించాడు. ప్రస్తుతం సీమంతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ, ఈ వేడుకలో మంచు ఫ్యామిలీ ఎక్కడ కనిపించకపోవడంతో..మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

అయితే మనోజ్ పెళ్లి చేసిన మంచు లక్ష్మీ కూడా సీమంతం వేడుకలో కనిపించలేదు. మరి మోహన్ బాబు ఫ్యామిలీ వచ్చిందా?లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. 

ఈ నేపధ్యంలో కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనోజ్, మౌనికకు కవలలు పుట్టబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో మంచు ఫ్యామిలీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. 
రీసెంట్ గా ఇదే విషయంపై మంచు మనోజ్ కూడా నోట్ విడుదల చేశాడు. అలాంటి వార్తల్లో నిజం లేదు..ఏ న్యూస్ ఏదీ ఉన్న అఫిషియల్ గా నేనే చెప్తాను అంటూ వివరణ ఇచ్చాడు.

మంచు మనోజ్ మూవీస్ కి బ్రేక్ ఇచ్చి చాలా రోజులైనా..ఫ్యాన్స్ తన మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో మంచు ఈ సారి గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం వాట్ ది ఫిష్( What The Fish) అనే మూవీ చేస్తున్నాడు