Sai Durga Tej: హనుమాన్ మేకర్స్తో మెగా హీరో.. కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీ

Sai Durga Tej: హనుమాన్ మేకర్స్తో మెగా హీరో.. కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీ

మెగా హీరో సాయి దుర్గ తేజ్(Sai durga tej) తరువాతి సినిమాపై చాలా కాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది.విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తరువాత కూడా చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు ఈ హీరో. మధ్యలో పవన్ కళ్యాణ్ తో బ్రో మూవీ చేసినా.. అది పవర్ స్టార్ ఖాతాలోకి వెళ్లిపోయింది. దీంతో సాయి తేజ్ ఫ్యాన్స్ కూడా ఆయన సినిమా కోసం చాలా కాలంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే దర్శకుడు సంపత్ నందితో గాంజా శంకర్ అనే మాస్ సినిమాను ప్రకటించాడు. 

కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది అనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. మేకర్స్ నుండి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా మరోసారి సాయి తేజ్ తరువాతి సినిమా ఏంటి విషయం తెరపైకి వచ్చింది. అదేంటంటే.. హనుమాన్ సినిమా మేకర్స్ సాయి తేజ్ తో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను రోహిత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తాడని సమాచారం. సాయి తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రానుందట ఈ సినిమా. 

నిజానికి ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన మే 30న రావాల్సింది. కానీ, అనుకోని కారణాల వల్ల వాయిదాపడిందని మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే మరో డేట్ ను ప్రకటించనున్నారు. తాజా అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ ప్రాజెక్టు గురించి మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. మరి చాలా గ్యాప్ తరువాత సాయి తేజ్ నుండి వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.