దేవాదాయ శాఖ డైరెక్టర్​గా హనుమంతరావు

దేవాదాయ శాఖ డైరెక్టర్​గా హనుమంతరావు


హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖ డైరెక్టర్ గా హనుమంతరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్న అనిల్ కుమార్ ( రిటైర్డ్ ఐఏఎస్ ) రాజీనామా చేయగా ప్రభుత్వం ఆమోదించింది. కాగా, హనుమంతరావు సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ గా పని చేస్తున్నారు.