హనుమత్ జయంతి (2026లో మే 12) వైశాఖ బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శని, కుజ దోషాలు తొలగిపోతాయి. మీ రాశిని బట్టి నిర్దిష్ట మంత్రాలను జపించడం ద్వారా కష్టాల నుండి ఉపశమనం, ఆంజనేయుడి అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.. ఏ రాశి వారు ఏ మంత్రం పఠించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
- మేష రాశి: ఓం అంగారకాయ నమః.. ఓం సర్వ దుఃఖ హరాయ నమః
- వృషభ రాశి: ఓం కపిసేనానాయకాయ నమః.. ఓం సర్వ దుఃఖ హరాయ నమః
- మిథున రాశి: ఓం మనోజవాయ నమః .. ఓం నమో హనుమతేనమః
- కర్కాటక రాశి: ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః... ఓం హం హనుమతే నమః
- సింహ రాశి: ఓం రామదూతాయ నమః.. ఓం వజ్రదేహాయ నమః
- కన్యా రాశి: ఓం మనోజవాయ నమః.. ఓం శూరాయ నమః
- తులా రాశి: ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః.. ఓం హం హనుమతే నమః
- వృశ్చిక రాశి: ఓం అంగారకాయ నమః.. ఓం హనుమతే నమః
- ధనుస్సు రాశి: ఓం రామదూతాయ నమః.. ఓం కపిసేనానాయకాయ నమః
- మకర రాశి: ఓం వీర హనుమతే నమః.. ఓం శని దోష హరాయ నమః
- కుంభ రాశి: ఓం శని దోష హరాయ నమః..ఓం వీర హనుమతే నమః
- మీన రాశి: ఓం రామదూతాయ నమః.. ఓం హనుమతే నమః
హనుమజ్జయంతి పూజా విధానం
- హనుమాన్ జయంతి ఉపవాసానికి ముందు రోజు రాత్రి నేలపై పడుకుని రాముడు, సీతాదేవి, హనుమంతుడిని స్మరించుకోవాలి.
- ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
- పూజ గదిలో ఒక చిన్న పీట వేసి దానిపై ఎరుపు రంగు వస్త్రం పరచాలి. తర్వాత దానిపై హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
- హనుమంతుడికి పండ్లు, ధూప, దీపాలు, నైవేద్యం సమర్పించాలి. శనగపిండి లడ్డూ లేదా బూందీ లడ్డు నైవేద్యంగా పెడితే హనుమంతుడు సంతోషిస్తాడు. తర్వాత హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించాలి. అలా చేయడం వల్ల మీకు హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి.
- ఆవనూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగిస్తే శని దోషం కూడా తొలగిపోతుంది.
- హనుమంతుడికి మల్లె నూనె దీపం అంటే చాలా ఇష్టమైనదిగా పండితులు చెబుతారు. ఈ దీపం వెలిగిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరతాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని సమాచారం పురాణాల ప్రకారం ఆధ్యాత్మిక నిపుణులు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
