
- కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండడమే కారణం
- విదేశాల్లో సంపాదన.. ఇండియన్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్
బిజినెస్ డెస్క్, వెలుగు: అమెరికా, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇండియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. యూఎస్‌లో పొందే కంఫర్ట్‌బుల్ లైఫ్‌ను 70 శాతం తక్కువ అమౌంట్‌తోనే ఇండియాలో పొందొచ్చు. అందుకే చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు తమ రిటైర్‌మెంట్ జీవితాన్ని ఇక్కడ గడపాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఫారిన్ కరెన్సీలు సంపాదిస్తారు కాబట్టి వీరికి అనేక అడ్వాంటేజ్‌లు ఉంటాయి. ఉదాహరణకు ఏ, బీ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారని అనుకుందాం. ఏ తన రిటైర్‌మెంట్ కోసం రూ.8.8 కోట్లను సేవ్ చేయడానికి, తన 30 వ ఏట నుంచి 60 వ ఏట వరకు ప్రతీ ఏడాది రూ.4.67 లక్షలు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఇన్‌ఫ్లేషన్ 6 శాతంగా, ఇన్వెస్ట్‌మెంట్లపై వచ్చే రిటర్న్ 7 శాతంగా ఉందని అనుకొని పై లెక్కలను మింట్ వేసింది. కాస్ట్ ఆఫ్ లివింగ్‌లో తేడా వలన ఇండియాలో రూ.40 లక్షల శాలరీ సంపాదిస్తున్న ఏ అనే వ్యక్తి, విదేశాల్లో లక్ష డాలర్లు (రూ.82 లక్షలు) సంపాదించే బీ అనే వ్యక్తి లైఫ్ స్టైల్‌లో గడపగలడు. ఇండియాలో రిటైర్‌మెంట్ తర్వాత కంఫర్టబుల్ లైఫ్ గడపడానికి ‘ఏ’ వ్యక్తి తన శాలరీలో 11.6 శాతం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటే, ‘బీ’ వ్యక్తి కేవలం 5.6 శాతం సేవ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ‘బీ’ అభివృద్ధి చెందిన దేశాల్లో రిటైర్ అవుదామని అనుకుంటే మాత్రం తమ ఎర్నింగ్స్‌లో 11 శాతం కంటే ఎక్కువ సేవ్ చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇండియాలో రిటైర్‌మెంట్ లైఫ్ గడుపుదామనుకునే ముగ్గురు వ్యక్తులను మింట్ ఇంటర్వ్యూ చేసింది. చాలా మంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గడపాలనే ఉద్దేశంతోనే తమ రిటైర్‌మెంట్ జీవితాన్ని ఇండియాలో గడుపాలనుకుంటున్నామని వెల్లడించారు.
ఉదాహరణ 1: బాలమురుగన్ కందసామి (37) ఫ్రాన్స్‌కు తొమ్మిదేళ్ల కిందట వలస వెళ్లారు. ఫ్రెంచ్ గవర్న్‌మెంట్ నుంచి వచ్చే పెన్షన్ తో ఇండియాలో తన రిటైర్‌మెంట్ జీవితాన్ని గడపాలని ప్లాన్ చేస్తున్నారు. ‘ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి పెన్షన్ పొందాలంటే కనీసం కొన్ని సంవత్సరాలు పనిచేయాలనే రూల్ ఉంటుంది. నాకు ఆ అర్హత ఉంది. నా ప్రాపర్టీని రెంట్‌కు ఇవ్వడం ద్వారా కొంత ఫారిన్ కరెన్సీని పొందుతాను’ అని కందసామి పేర్కొన్నారు. ఇండియాలో మాదిరి కాకుండా ఫ్రాన్స్‌లో ప్రాపర్టీలను కొన్ని ఏజెన్సీలతో ఈజీగా మేనేజ్ చేయొచ్చన్నారు. తన ఇన్వెస్ట్‌మెంట్లలో 80 శాతం ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లో, 20 శాతం ఫారిన్ ఈక్విటీల్లో పెట్టారు. ఫారిన్‌లో కంఫర్టబుల్ లైఫ్ గడపడానికి ఏడాదికి 36 వేల పౌండ్లు (రూ.18 లక్షలు) అవసరమవుతాయని, ఈ డబ్బులతో ఇండియాలో దర్జాగా బతకొచ్చని వివరించారు.
ఉదాహరణ 2: వరుణ్ అగర్వాల్ (36), ఆయన భార్య ఇద్దరూ ప్రొఫెసర్లు. ఇండియాలో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో గ్రీన్ కార్డ్‌కు అప్లయ్ చేసుకోలేదు. తాజాగా న్యూయార్క్ నుంచి నవీ ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ‘యూఎస్ రెసిడెంట్‌గా ఇండియాలోని మ్యూచువల్ పండ్స్‌లో ఇన్వెస్ట్ చేయలేను. నేషనల్ పెన్షన్ స్కీమ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎంత అమౌంట్ అయినా తక్కువ ఖర్చుకే ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇండియాకు షిఫ్ట్ అయ్యాక మ్యూచువల్ పండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాం. ఎక్కువగా పాసివ్ ఫండ్స్‌లో పెట్టాం. మరోవైపు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌లో మా సేవింగ్స్‌ను పెంచుకుంటున్నాం. మా పోర్టుఫోలియోని సింపుల్‌గా ఉంచుకోవాలని చూస్తున్నాం’ అని వరుణ్ అగర్వాల్ పేర్కొన్నారు. రిటైర్‌మెంట్ కోసం 75 శాతం అమౌంట్‌ను ఎన్‌పీఎస్‌లో, మిగిలినది ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టామని వరుణ్ వెల్లడించారు. విదేశాల్లో ఎటువంటి పెన్షన్ రాదన్న ఆయన, యూఎస్‌లో కంఫర్ట్‌బుల్ లైఫ్ కోసం ఏడాదికి 96 వేల డాలర్లు (రూ.79 లక్షలు) అవసరమని చెప్పారు. ఇదే లైఫ్ స్టైల్‌ను ఇండియాలో రూ.15 లక్షలతో పొందొచ్చన్నారు.
ఉదాహరణ 3: గత ఇరవై ఏండ్లగా దుబాయ్‌లో పనిచేసిన సుమంత బెనర్జీ (70) తన రిటైర్‌మెంట్‌ను ఇండియాలో చక్కగా ప్లాన్ చేసుకున్నారు. చార్టర్ అకౌంటెంట్ అయిన బెనర్జీ , తన మనీని మేనేజ్ చేయడానికి సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ను నియమించుకున్నారు. దుబాయ్‌లోని లైఫ్ స్టైల్ మాదిరే ఇండియాలో కూడా ఉండేలా చూసుకుంటున్నానని అన్నారు. దుబాయ్‌లో ఎటువంటి పెన్షన్ కాన్సెప్ట్ ఉండదని, కానీ, గ్రాట్యుటీ పొందానని వివరించారు. ఆయనిప్పుడు ట్రావెలింగ్, రైటింగ్‌కు ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ ఇండియాకు రిటర్న్ వచ్చినప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ (ఫెమా), ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టాలను కచ్చితంగా పాటించాలి. ఐటీ రూల్స్‌కు భిన్నంగా ఫెమా ఉంటుంది.