
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ( మే 11) యూపీ లోని లక్నో సిటీలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ తాను లక్నో ఎందుకు రాలేకపోయానో వివరించారు. తప్పనిసరి పరిస్థితిలో ఢిల్లీలో ఉండాల్సి వచ్చిందన్నారు. ఇదే రోజున మన శాస్త్రవేత్తలు పోఖ్రాన్ లో అణు పరీక్షలు చేశారన్నారు.
40 నెలల్లోనే ఈ యూనిట్ ను పూర్తి చేశామని.. ఇంతతక్కువ సమయంలో ఈ యూనిట్‌ను సిద్దం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. మేడిన్ ఇండియాలో భాగంగా క్షిపణి ఏర్పాటు కేంద్రాన్ని యూపీలో ప్రారంభించామన్నారు. ఆపరేషన్ సింధూర్ లో బ్రహ్మోస్ క్షిపణి పనితీరు గురించి పాకిస్తాన్ ను అడిగితే తెలుస్తుందన్నారు.
#WATCH | Defence Minister Rajnath Singh says, "At the inauguration of BrahMos Integration & Testing Facility Center today, I feel delighted to speak with you. I wanted to attend in person. But you know why I couldn't come. Looking at the situation we are facing, it was important… pic.twitter.com/rlRSOXXfQZ
— ANI (@ANI) May 11, 2025
యోగి ఏమన్నారంటే...
బ్రహ్మోస్ పవరేంటో పాకిస్తాన్ కు తెలుసని.. యూపీ సీఎం యోగి అన్నారు. పాకిస్తాన్ పై బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించామన్నారు. టెర్రరిజంపై బ్రహ్మోస్ క్షిపణి సమాధానం చెప్పిందన్నారు. బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ప్రపంచంమంతా చూసిందన్నారు. లక్నోలోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్... .. 300 కోట్ల రూపాయల ఖర్చుతో బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేశామని యూపీ సీఎం యోగి తెలిపారు. ఈ యూనిట్ సుమారు 80 హెక్టార్ల స్థలాన్ని ఉచితంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
#WATCH | Lucknow | UP CM Yogi Adityanath says, "You must have seen a glimpse of the BrahMos missile during Operation Sindoor. If you didn't, then just ask the people of Pakistan about the power of the BrahMos missile. PM Narendra Modi has announced that any act of terrorism going… pic.twitter.com/lv2LzYNcXs
— ANI (@ANI) May 11, 2025
కొత్తగా ప్రారంభమవుతున్న ఈ క్షిపణి తయారీ కేంద్రం నుంచి 100 నుంచి 150 కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయనున్నారు. ఈ కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులు ఏడాదిలోగా డెలివరీకి సిద్ధం కానున్నాయి. ఈ న్యూజనరేషన్ బ్రహ్మోస్ క్షిపణి పరిధి 300 కిలోమీటర్లు. దీని బరువును తగ్గించారు. ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి బరువు 2900 కిలోలు కాగా, న్యూ బ్రహ్మోస్ క్షిపణి బరువు 1290 కిలోలు.
►ALSO READ | బ్రహ్మోస్ పవరేంటో పాక్ కు బాగా తెలుసు: యోగి ఆదిత్యనాథ్
ఏడాదికి 80 నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులు తయారుచేసేలా ఈ ప్రొడక్షన్ యూనిట్‌ను డిజైన్ చేశారు. భారత్, రష్యాల సంయుక్త వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. ఈ క్షిపణిని ఫైర్ అండ్ ఫర్గెట్ గైడెన్స్ సిస్టమ్‌తో భూ ఉపరితలం నుంచి, సముద్ర తలం నుంచి, గగనతలం నుంచి ప్రయోగించవచ్చన్నారు.