బ్రహ్మోస్ పవరేంటో పాక్ కు బాగా తెలుసు: యోగి ఆదిత్యనాథ్

బ్రహ్మోస్ పవరేంటో పాక్ కు బాగా తెలుసు: యోగి ఆదిత్యనాథ్

బ్రహ్మోస్ పవరేంటో పాకిస్తాన్ కు బాగా తెలుసన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. లక్నోలోని ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన  యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.  ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణిని ఉపయోగించినట్లు చెప్పారు. బ్రహ్మోస్ పనితీరు ప్రపంచం అంతా చూసిందన్నారు. 

ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి శక్తి స్పష్టంగా కనిపించింది. ఎవరైనా దానిని మిస్ అయితే దాని ప్రభావం ఎలా ఉంటుందో పాకిస్తాన్‌ను అడిగి తెలుసుకోండి. ఉగ్రవాదం కుక్క తోక లాంటిది ఉగ్రవాదం విషయంలో  దానికి  స్వంత భాషలోనే సమాధానం చెప్పాలి. ఉగ్రదాడి ఏదైనా యుద్ధంగానే పరిగణించాలి అని ఆదిత్యానాథ్ అన్నారు. 

►ALSO READ | ఆపరేషన్ సిందూర్ ఇంకా ఆగలేదు..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన

మరో వైపు కాసేపటి క్రితమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని ట్వీట్ చేసింది. తమకు అప్పగించిన టాస్క్ ను విజయవంతంగా  పూర్తి చేశామని చెప్పింది.  ఆపరేషన్ సిందూర్ పై ఊహాగానాలు నమ్మొద్దని ట్వీట్ చేసింది.