ఆపరేషన్ సిందూర్ ఇంకా ఆగలేదు..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన

ఆపరేషన్ సిందూర్ ఇంకా ఆగలేదు..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని ట్వీట్ చేసింది. తమకు అప్పగించిన టాస్క్ ను విజయవంతంగా  పూర్తి చేశామని చెప్పింది.  ఆపరేషన్ సిందూర్ పై ఊహాగానాలు నమ్మొద్దని పూర్తి వివరాలు కాసేపట్లో వెల్లడిస్తామని ట్వీట్ చేసింది.

మే 11న సాయంత్రం భారత్,పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి.అయితే కొన్ని గంటలకే పాక్ కాల్పుల విరమణకు తూట్లు పొడిచి సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది.మాట మీద నిలబడని పాకిస్తాన్ ను నమ్మేది ఎలా అని ప్రశ్నించాయి. ఏం సాధించామని..కాల్పుల విరమణకు అంగీకరించారు..పహల్గామ్ దాడి చేసిన ఉగ్రవాదుల్ని ఏమైనా పట్టుకున్నామా.? భారత్ అనుకున్న లక్ష్యం నెరవేరిందా? అని సామాన్యుల నుంచి సైతం సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే  ఆపరేషన్ సిందూర్ ముగియలేదని కొనసాగుతోందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించడం గమనార్హం.

మరో వైపు   ప్రధాని మోదీ తన నివాసంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్,సిడిఎస్ అనిల్ చౌహాన్,  త్రివిధ దళాధిపతులు, ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ తో భేటీ అయ్యారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన, ప్రస్తుతం పరిస్థితులపై చర్చిస్తున్నారు. అలాగే మే 12న భారత్, పాకిస్తాన్ సైన్యం జరిపే చర్చలో లేవనెత్తాల్సిన అంశాలపై డిస్కస్ చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ తో పాటు సరిహద్దులో భద్రతపై చర్చిస్తున్నారు.