
హైదరాబాద్, వెలుగు: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ కారు విండ్సర్ ప్రో హైదరాబాద్‌లో శనివారం విడుదల అయింది. నగరానికి చెందిన పీపీఎస్ మోటార్స్ ఎల్బీ నగర్ ఎంజీ షోరూంలో దీనిని ఆవిష్కరించింది. మొదటి 8,000 మంది వినియోగదారులకు రూ.17.49 లక్షల ఎక్స్‌షోరూం ధరకు అందిస్తారు. బ్యాటరీ యాజ్ఏ సర్వీస్(బీఏఏఎస్) విధానంలో ఎక్స్‌షోరూం ధర రూ.12.49 లక్షలు ఉంటుంది.
బ్యాటరీ కిరాయి కిలోమీటరుకు రూ.4.5 చొప్పున చెల్లించాలి. ఇందులోని 52.9 కిలోవాట్అవర్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. విండ్‌సర్ ప్రోలోని ఎలక్ట్రిక్ మోటార్ 136 హెచ్‌పీ శక్తిని, 200 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ జామ్ అసిస్ట్ లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి 12 ఫీచర్లు ఉన్నాయి.
పవర్డ్ టెయిల్‌గేట్, కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ ఇంటీరియర్స్, 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8.8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు వంటి అదనపు ఆకర్షణలూ ఉన్నాయి.