రష్కాపై ఆంక్షలు.. పాకిస్తానుకు మాత్రం డబ్బులు,.. బయటపడ్డ పాశ్చాత్య దేశాల కుటిలనీతి..

రష్కాపై ఆంక్షలు.. పాకిస్తానుకు మాత్రం డబ్బులు,.. బయటపడ్డ పాశ్చాత్య దేశాల కుటిలనీతి..

IMF Loan To Pakistan: ఉగ్రవాదం అనే వనాన్ని దశాబ్ధాలుగా సాగు చేస్తున్న పాక్ తన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కంటే కూడా భారత పతనంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతూ వచ్చింది. అందుకే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాని పరిస్థితి దిగజారుతూనే ఉంది. మరో పక్క నియంతలా మారిన అక్కడి ఆర్మీ తమ వ్యాపారాలు, లాభాల కోసం రాజకీయ అనిశ్చితిని సృష్టిస్తూ వచ్చింది. దీంతో పాక్ నిరంతరం అంతర్జాతీయ ద్రవ్య నిధితో పాటు మిత్ర దేశాల నుంచి రుణాలపై ఆధారపడుతూ వచ్చింది.

తాజాగా పాకిస్థాన్ ఆర్థిక సహాయం కోసం చేయిచాచగా ఐఎంఎఫ్ దానికి అత్యవసర సాయం కింద రూ.8వేల కోట్ల రుణాన్ని అందించింది. భారత్ దీనిని వ్యతిరేకిస్తున్నప్పటికీ పాక్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని, తమకు నమ్మకాన్ని కలిగిస్తోందంటూ ఐఎంఎఫ్ చెప్పటం పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే పాక్ అడుక్కున్న డబ్బులు కనీసం 10 రోజులకు కూడా సరిపోవని అందరికీ తెలిసిందే అంటూ నెట్టింట మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. 

రష్యాకు అలా.. పాకిస్తాన్ విషయంలో ఇలా..
పాశ్చాత్య దేశాలు రెండు నాలుకలతో ఎలా వ్యవహరిస్తాయనే విషయం మరోసారి ఐఎంఎఫ్ పాకిస్తాను అందించిన రుణాలు నిరూపించాయి. ఎందుకంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఈ వెస్ట్రన్ కంట్రీస్ రష్యాపై 10వేలకు పైగా ఆంక్షలు విధించాయి. అలాగే రష్యాకు చెందిన 2లక్షల 40వేల కోట్ల రూపాయల డబ్బును ఫ్రీజ్ చేశారు. ఇక్కడితో ఆగకుండా స్విఫ్ట్ ఖాతాలను నిలిపివేశారు. అనేక దేశాల సంస్థలు రష్యాలో తమ వ్యాపార కార్యక్రమాలను నిలిపివేసేలా చేశారు. ఆ సమయంలో యూరోపియన్ దేశాలు అత్యవసరంగా స్పందించి ఇన్ని చర్యలు చేపట్టాయి.

►ALSO READ | Real Estate: నార్త్ ఇండియాలో కుప్పకూలిన రియల్టీ రంగం.. ఇళ్లు కొనేటోళ్లే లేరు..!

అయితే ప్రస్తుతం అవే దేశాలు ఇండియా-పాక్ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. రుణాలను అందించే విషయంలో తమకు ఉన్న పవర్స్ ఉపయోగించి ఐఎంఎఫ్ నుంచి పాకిస్తానుకు రూ.8వేల కోట్లు సాయం అందేలా చేశాయి ఈ పాశ్చాత్య దేశాలు. అయితే ఈ కుటిల ద్వంద్వ నీతిపై భారతదేశంలో భారీగా చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం పాకిస్తానుకు డబ్బులు ఇప్పించేందుకు ఫ్రాన్స్, జర్మనీ, యూకే, చైనా, అమెరికా వంటి దేశాలు తమ ఓటింగ్ పవర్ ద్వారా పరోక్షంగా సహాయం చేయటాన్ని సగటు భారతీయుడు తప్పుపడుతున్నాడు.

కోటా విధానం కింద ఆర్థిక వ్యవస్థ ఆధారంగా ఈ ఓటింగ్ రైట్స్ ఇవ్వబడతాయి. వాస్తవానికి భారత్ చైనా, అమెరికా కంటే వెనకన అభివృద్ధి చెందిన దేశంగా ఉండటంతో కేవలం 2.7 శాతం ఓటింగ్ పవర్ కలిగి ఉంది. కానీ అమెరికా అత్యధికంగా 17 శాతం ఓటింగ్ పవర్ హోల్డ్ చేస్తోంది. ఒకే పరిస్థితి ఉన్నప్పటికీ రష్యా విషయంలో ఒకలా, పాకిస్థాన్ విషయంలో మరోలా ఈ పాశ్చాత్య దేశాలు వ్యవహరించటం వాటి నిజాయితీని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. పైగా తమదాకా వస్తే ఒక ధోరణి, వేరే దేశాల విషయంలో మరో ధోరణిని ప్రదర్శించటంపై ప్రతి భారతీయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.