ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైబ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రమోటర్లు దూరం

ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైబ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రమోటర్లు దూరం

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ప్రమోటర్లు నారాయణ మూర్తి, నందన్ నీలేకని,  తదితరులు ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రకటించిన రూ.18 వేల కోట్ల షేర్ బైబ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనమని ప్రకటించారు. ఈ విషయాన్ని  కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ఇన్ఫోసిస్ గత పదేళ్లలో అతిపెద్ద  షేర్ బైబ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. 

గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొనడంతో టెక్ షేర్లు వోలటాలిటీలో కదులుతున్నాయి. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంపెనీ బైబ్యాక్ ప్రకటించింది. ప్రమోటర్ గ్రూప్ మొత్తం 13.05శాతం (54.20 కోట్ల షేర్లు) వాటాను కలిగి ఉంది. నారాయణ మూర్తి 0.36శాతం, నీలేకణి 0.98శాతం వాటాను హోల్డ్ చేస్తున్నారు. కృష్ణ గోపాలకృష్ణన్  భార్య సుధా గోపాలకృష్ణన్ 2.3శాతం వాటాతో అతిపెద్ద ప్రమోటర్ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. ఇన్ఫోసిస్ రూ.1,800 ధరకు 10 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనుంది.

 పెయిడప్ ఈక్విటీ షేర్లలో ఇది 2.41 శాతం వాటాకు సమానం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఫ్రీ క్యాష్ ఫ్లోలో 85శాతం వాటాను డివిడెండ్లు, బైబ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చెల్లించడానికి వాడతామని కంపెనీ  ఇప్పటికే ప్రకటించింది. కాగా, ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి  గత 10 ఏళ్లలో ఇది ఐదో బైబ్యాక్. 2022లో రూ.9,300 కోట్ల విలువైన బైబ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  షేరు ధర రూ.1,850 వద్ద చేపట్టింది. అప్పుడు 6 కోట్ల షేర్లను షేర్ హోల్డర్ల నుంచి కొనుగోలు చేసింది.