హర్ ఘర్ తిరంగా ... తన ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన అమిత్ షా

హర్ ఘర్ తిరంగా ... తన ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన అమిత్ షా

75ఏళ్ల వేడుకను ఘనంగా జరుపుకునేందుకు యావత్ దేశం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి దేశభక్తి వెల్లువగా ప్రవహిస్తోంది. మరోవైపు కేంద్రం తలపెట్టిన ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా చేపట్టి హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి విపరీతమైన స్పందన వస్తోంది. కాగా ఆగష్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్న ప్రధాని పిలుపునిచ్చిన విషయం తేలిసిందే. ఈ మేరకు... నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆయన సతీమణి సోనల్ తో కలిసి తమ ఇంటిపై త్రివర్ణ జెండాను ఎగురవేశారు.

అస్సాం ముఖ్యమంత్రి హేమంత సోరెన్ కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గుహవటిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ మేరకు  ప్రభాత్ ఫేరి' కార్యక్రమంలో ఇలా పాఠశాల విద్యార్థులతో కలిసి ఈ రోజును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని హేమంత్ అన్నారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా జాతీయ జెండాను తమ ఇంటిపై ఎగురవేయాలని ఆయన కోరారు. ఇకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలోని తన అధికారిక నివాసంలో పాఠశాల విద్యార్థులతో కలిసి తిరంగా ప్రచారాన్ని ప్రారంభించారు.