కేంద్రం తెచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి రాజీనామా

కేంద్రం తెచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి రాజీనామా

కేంద్రమంత్రి పదవికి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా

‘వ్యవసాయ బిల్లుల’కు నిరసనగా నిర్ణయం

న్యూఢిల్లీ: శిరోమణి అకాలీదళ్ లీడర్ హర్ సిమ్రత్ కౌర్.. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ లు, చట్టాలకు నిరసనగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశా. ఓ బిడ్డగా, ఓ సోదరిగా రైతుల పక్షాన నిలబడటం ఎంతో గర్వంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు. అంతకుముందు లోక్ సభలో అకాళీదళ్ ప్రెసిడెంట్, హర్ సిమ్రత్ కౌర్ భర్త సుక్బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ.. వ్యవసాయ బిల్లులు తీసుకురావడానికి నిరసనగా ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని చెప్పారు. పంజాబ్ ప్రభుత్వాలు 50 ఏళ్లపాటు పడిన కష్టాన్ని.. ఇప్పుడు తీసుకురాబోయే కొత్త చట్టాలు నాశనం చేస్తాయన్నారు. కాగా, ఎన్నో ఏళ్లుగా బీజేపీకి మిత్రపక్షంగా అకాలీదళ్ కొనసాగుతోంది. కేంద్రం లోక్ సభలో ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్, కామర్స్ (ప్రమోషన్, ఫెసిలిటేషన్) బిల్లు.. ఫార్మర్స్ (ఎంపవర్ మెంట్, ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్షూరెన్స్, ఫార్మ్ సర్వీసెస్ బిల్లు.. ఎస్సెన్షియల్ కమొడిటీస్ (అమెండ్ మెంట్) బిల్లు ప్రవేశపెట్టింది. ఈ మూడు బిల్లులు తీసుకురావడంపై నిరసన గానే సిమ్రత్ కౌర్ రాజీనామా  చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం.. కొత్త బిల్లుల వల్ల రైతులకు లాభమని చెబుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మార్కెట్లు, ధరల నుంచి రైతులను విముక్తి చేస్తాయని అంటోంది. రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధర కోసం ప్రైవేట్ పార్టీలతో ఒప్పందాలు చేసుకోవచ్చని చెబుతోంది.

For More News..

కరోనా గురించి ఆలోచిస్తూ.. ఆ వ్యాధిని మరవొద్దు

8 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రిక్రూట్‌‌మెంట్‌‌

దుబ్బాక ఎన్నికల్లో పోటీచేస్తే సజీవదహనం చేస్తాం